![]() |
![]() |

బుల్లితెర నటి కరుణా భూషణ్ రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఆల్రెడీ పదేళ్ల వయసున్న ఒక బాబు ఉన్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కరుణ్ భూషణ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జగపతి బాబు నటించిన ఆహా మూవీతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన కరుణ.. కాస్త గ్యాప్ తీసుకుని శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు లాంటి కొన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు ఎన్నో సీరియల్స్ లో కూడా నటించింది.

'అభిషేకం' సీరియల్ లో కరుణ నేతకు ఆడియన్స్ ఫిదా ఇపోయారు. అలా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తోంది. ఇప్పుడు కవల పిల్లలు పుట్టడంతో అది కూడా తన పుట్టినరోజునాడే కావడంతో కరుణా చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు దేవతలు తన జీవితంలోకి వచ్చి ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చారు..వాళ్ళు రావడంతో తన ఆనందం డబుల్ అయ్యిందంటూ తన పోస్టులో చెప్పేసరికి కవల ఆడపిల్లలు పుట్టారనే విషయం తెలుస్తోంది. ఇక నెటిజన్స్, బుల్లితెర నటులంతా ఆమెకు విషెస్ చెప్తున్నారు.
![]() |
![]() |